ఎంఎస్ ధోని తల్లితండ్రులు నిన్న ఫస్ట్ టైమ్ చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ చూశారు. ధోనీ 2004 లో కెరీర్ ప్రారంభించి క్రికెటర్ అయ్యి..తర్వాత కెప్టెన్ అయ్యి..ఎన్నో చారిత్రక విజయాలను అందించిన ఏ సందర్భంలోనూ ధోనీ తల్లితండ్రులు స్టేడియంకు వచ్చి మ్యాచ్ చూసింది లేదు. అలాంటిది నిన్న వాళ్లు రాగానే ఇంకేం ముంది ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు. చెన్నైలో ఆడే ఈ మ్యాచే లాస్ట్ మ్యాచ్. అందుకే ధోని తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకి, భార్య సాక్షి, కుమార్తె జివా అందరూ స్టేడియానికి వచ్చారు అన్నారు. నేషనల్ మీడియా కూడా ఇదే విషయంపై వార్తలను ప్రచురించింది. అయితే అంతా కామ్ గానే ఉంది. ధోని ఢిల్లీ మీద మ్యాచ్ ఆడాడు. చాన్నాళ్ల తర్వాత దాదాపు పది ఓవర్లు పాటు బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కానీ అంత టచ్ లో లేని యధావిధిగా టీ20ల్లో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడి 26 బాల్స్ లో ఓ సిక్సు ఓ ఫోరుతో 30 పరుగులు చేశాడు. అటు వైపు విజయ్ శంకర్ కూడా నీరసంగా వన్డే తరహా లో హాఫ్ సెంచరీ కొట్టినా లక్ష్యం పెద్దది కావటంతో సీఎస్కే 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ రిటైర్మెంట్ ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందనేది స్పష్టంగా అర్థం అవుతోంది. కానీ ధోని మాత్రం నిన్న రిటైర్మెంట్ అనౌన్స్ చేయలేదు. మ్యాచ్ తర్వాత మీడియాతో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు. అప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు అసలు అలాంటి విషయం ఏదీ తమ మధ్య చర్చకు రాలేదని చెప్పాడు ఫ్లెమింగ్. ఒకవేళ ధోని అలాంటి నిర్ణయం తీసుకున్నా ఆఖరి నిమిషం వరకూ తమకు కూడా చెప్పడని...ప్రస్తుతానికి అతనితో కలిసి పనిచేయటాన్ని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నానమని చెప్పాడు ఫ్లెమింగ్. మరి చూడాలి నెక్ట్స్ మ్యాచ్ ఏప్రిల్ 8 సీఎస్కే పంజాబ్ తో ఆడనుంది అది జరిగేది చెన్నైలో కాదు చంఢీఘర్ లో. ఆ తర్వాత మ్యాచ్ కోల్ కతా చెన్నైలో 13వ తారీఖున ఆడనుంది. మిడ్ ఆఫ్ ది సీజన్ వెళ్లిపోవచ్చు అనే టాక్ నడుస్తోంది. సో పంజాబ్ తో చండీఘర్ లో ఆడే మ్యాచ్ తర్వాత ధోని తన డెసిషన్ తీసుకోవచ్చా. చెన్నైలో అయితే ఇదే ఆఖరి మ్యాచ్ కాబట్టి 20ఏళ్లలో ఎప్పుడూ లేనిది పేరెంట్స్ వచ్చి మ్యాచ్ చూశారా చూడాలి.